Hyd, Jan 26: తెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు (Republic Day Celebrations at Raj Bhavan) తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళులర్పిస్తున్నాను అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది.అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నాను. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే మనం ముందున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే 200 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నాం.
Here's Dr Tamilisai Soundararajan Tweet
Hoisted the National Flag & delivered speech on the ocassion of 73rd #RepublicDay2022 at Raj Bhavan #Hyderabad.
Alongside Senior officials & Staff with covid precautions.
73 వ గణంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజ్ భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరించడం గొప్ప గౌరవం గా బావిస్తున్నాను. pic.twitter.com/MKTtqvxSpD
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 26, 2022
హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషించదగ్గ విషయం. విద్యా వ్యవస్థలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilisai Soundararajan ) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .