TSPSC

Hyd, August 4: తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)ల సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది. వీఆర్ఏల స‌ర్దుబాటు కోసం ప్రభుత్వ విభాగాల్లోని వివిధ శాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది.

రెవెన్యూ శాఖ‌లో 2,451 జూనియ‌ర్ అసిస్టెంట్, పుర‌పాల‌క శాఖ‌లో 1,266 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు, రెవెన్యూ శాఖ‌లో 679 స‌బార్డినేట్ పోస్టులు, నీటిపారుద‌ల శాఖ‌లో 5063 ల‌ష్క‌ర్, హెల్ప‌ర్ పోస్టులు, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల‌ను కొత్త‌గా సృష్టించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు, వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు

వీఆర్‌ఏల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. వీఆర్‌ఏల సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని, వారి అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీఆర్‌ఏల సర్దుబాటుపై మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం వీఆర్‌ఏలతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకుంది. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం వీఆర్‌ఏలను సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది.