VC Sajjanar (Photo-Twitter)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేశామని, అక్టోబరు వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా ఈ వివరాలను వెల్లడించారు.

ట్విట్టర్‌ వేదికగా వీసీ సజ్జనార్‌..‘టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది.

Here's News

తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది’ అని తెలిపారు.