
Hyderabad, Jan 18: తెలంగాణ ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట్ సర్పంచ్ కుమారస్వామిపై టీఎస్ హైకోర్టు (Telangana high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు అతడికి రూ. 50 వేల జరిమానా విధించింది. కాగా గ్రామస్తులపై ఎస్‌ఐ తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నాడని ఇటీవల ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసులను కోట్టివేసి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. పిల్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
సర్పంచ్ తనపై కేసు నమోదైన విషయాన్ని దాచిపెట్టినట్లు నిర్ధారణ కావడంతో అతడి తీరుపై (laxmidevipet sarpanch) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కోర్టులో పిల్ వేయడం సరికాదని మందలించింది. కేసు వెనక్కి తీసుకోవడానికి అనుమతివ్వాలన్న సర్పంచ్ అభ్యర్థనను సైతం కోర్టు తిరస్కరించింది. పిల్‌ను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా సర్పంచ్‌ను ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకోనున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్‌కు చేరుకోవడంతో సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు.
బ్యారేజ్ పరిసరాల్లో అధికారులతో కలిసి సుమారు 4 గంటల పాటు పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేసి అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.