Telangana HighCourt On Dogs Bite(Twitter)

Hyd, Sep 10: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ పిటిషన్ ను కొట్టివేసింది. మరో పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు (Ganesh Visarjan in Hussain Sagar) యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది. వాటిని అమలు చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను సైతం కొట్టివేసింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సైతం కోర్టు తిరస్కరించింది.

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్‌ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం ( Ganesh immersion in Hussain Sagar) చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్‌.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.  హైదరాబాద్ వాసులకు షాక్, హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు

మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్‌ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.

కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.

Here's Raja sing Statement

ట్యాంక్ బండ్ పై జీహెచ్ఎంసీ పెట్టిన ఫ్లెక్సీలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలు వెయ్యకపోతే.. ఎక్కడ వెయ్యాలో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు ఎక్కడ వేయాలని ప్రజలు ఆందోళనలు చెందుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వినాయక్ సాగర్ లో నిమజ్జనాలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.గణేష్‌ నిమజ్జనాల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను వెల్లడించండి అని ట్విట్టర్‌ వేదికగా కోరారు.