High Court of Telangana | (Photo-ANI)

Hyd, Oct 28: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పును వెలువరించింది. దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్‌ కమిషన్‌ (Election Commission)ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కాగా హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ దళితబంధును (dalitha bandhu) ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. గురువారం నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.

ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు వేల విజ్ఞాప‌న‌లు, ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, 9వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి

ఎన్నికల సంఘం కరోనా పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్‌కు 72 గంటల ముందే హూజురాబాద్ లో (Huzurabad Bypoll) ప్రచారాన్ని నిలిపివేసింది.ఈ నెల 30న ఉదయం 7గం.కు పోలింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే నెల 2న ఓట్లు లెక్కిస్తారు.