R-Day Celebrations In Telangana: పరేడ్ గ్రౌండ్ నుండి పబ్లిక్ గార్డెన్స్‌‌కు మారిన వేదిక, తెలంగాణాలో కన్నుల పండుగగా సాగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, సీఎం కేసీఆర్ పాలనపై గవర్నర్ ప్రశంసలు
CM KCR In Republic day Celebrations (Photo-Twitter)

Hyderabad, January 26: తెలంగాణ రాష్ట్రంలో 71వ భారత గణతంత్ర వేడుకలు (India Republic Day 2020) వైభవంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి వేదికను మార్చింది. ఇంతకుముందు ఎప్పుడూ సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో రిపబ్లిక్ వేడుకలు (Republic Day celebrations) జరిగేవి. అయితే ఈ సారి హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో (Public Garden) 71వ గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai Soundararajan) జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సౌందరారాజన్‌కు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాతఇది మొదటి గణతంత్ర దినోత్సవ వేడుక.

ఢిల్లీ రాజపథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న తెలంగాణా శకటం 

ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (Chief Minister K. Chandrashekhar Rao)పాటు, సభాపతి పోచార శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.

Telangana CMO Tweet

రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్‌ స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ​కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగిస్తూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎ‍న్నో రకాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిగమించారని ప్రశంసించారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కొత్త చట్టాలతో అవినీతి రహిత రాష్ట్రంగా పేరు గాంచిన తెలంగాణ ప్రజల పనుల్లో ఆలస్యం కాకుండా సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాలు సత్ఫలితాలను సాధించాయన్నారు.

పరేడ్ గ్రౌండ్ లో సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేని స్వచ్ఛమైన రెవెన్యూ పాలన అందించాలని నిర్ణయించామన్నారు. మిషన్‌ భగీరథ, 24 గంటల కరెంటు, కొత్త ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో సాగు, తాగు నీరందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్‌, జై తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌, మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు.

ఢిల్లీలో అదరహో అనిపిస్తున్న తెలుగు రాష్ట్రాల శకటాలు

ఈ వేడుకల్లో ప్రభుత్వం పరేడ్ మైదానంలో విన్యాసాలు, పాఠశాల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వైభవాన్ని చెప్పే శకటాలు వంటివి లేకుండా మార్పులు చేసింది. గతంలో వేడుకకు కనీసం రెండు గంటలు సమయం పట్టేది. అయితే ఈ సారి పాత ఫార్మాలిటీకి స్వస్తీ చెప్పి కేవలం 35 నిమిషాల్లో పూర్తిచేశారు.

Republic Day 2020 Greetings కోసం క్లిక్ చేయండి 

అయితే దీనికి కారణం లేకపోలేదు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర నిర్మాణ దినోత్సవ వేడుకలు ప్రజలకు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండే ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం నేపథ్యంలో వేదికను మార్చారు.

జాతీయజెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడానికి స్వాతంత్య్ర దినోత్సవ కవాతు వేదికను పరేడ్ గ్రౌండ్స్ నుండి చారిత్రాత్మక గోల్కొండ కోటకు తెలంగాణా సీఎం కేసీఆర్ మార్చిన విషయం విదితమే.

భారత గణతంత్ర దినోత్సవం, ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్

గతంలో, గవర్నర్ విశాలమైన పరేడ్ గ్రౌండ్‌లో పలు బృందాలతో కూడిన కవాతును వీక్షించడానికి ఓపెన్ టాప్ వాహనంలో నిలబడేవారు. ఇంతకుముందు ఈ వేడుకలలో వివిధ పోలీసు విభాగాలు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్) మరియు పాఠశాలల నుండి అనేక మంది విద్యార్థులు పాల్గొనేవారు. వివిధ ప్రభుత్వ పథకాల నుండి అనేక పట్టికలు వివిధ ప్రభుత్వ పథకాలను ఈ వేడుకల్లో హైలెట్ చేసేవారు.అయితే ఈ సారి అవేమి లేకుండా సింపుల్ గా రిపబ్లిక్ డే వేడకలు జరిపారు.