Representational Image (Photo Credits: ANI)

Hyd, Nov 15: భాగ్య నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య (Hyderabad Man kills self) చేసుకున్నాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గోల్కొండ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌పేట్‌ ప్రాంతంలో నివసిస్తున్న సంతోష్‌(36) హైటెక్‌ సిటీ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో 14 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల క్రితం పురానాపూల్‌కు చెందిన అరుణ కుమార్తె కళ్యాణితో అతడికి వివాహం అయింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు అభిరామ్‌ ఉన్నాడు. అభిరాం పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నాడు. ఐదారు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

గత శుక్రవారం కౌన్సెలింగ్‌ కోసం భరోసా సెంటర్‌కు వెళ్లారు. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు (blames wife, in-laws in selfie video) తాళలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్‌లో పురుగుల మందు తెప్పించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్‌ డ్రింక్‌లో ఆ మందును కలిపి తాగాడు. రాత్రంతా వాంతులు, విరేచనాలు అయ్యాయి. మరుసటి రోజు ఉదయం తమ్ముడు అన్వేష్ కు ఫోన్‌ చేశాడు. మందులు తీసుకురమ్మని చెప్పడంతో తీసుకెళ్లాడు. అన్వేష్‌ గదిలోకి వెళ్లి చూడగా పురుగుల మందు కనిపించింది. సంతోష్‌ తన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు తల్లి జ్యోతికి పంపండంతో ఆమెకు అనుమానం వచ్చి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే సంతోష్‌ పరిస్థితి విషమించడంతో వెంటనే గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు.

బట్టతల ఉన్నా..విగ్గుతో 20 మంది అమ్మాయిల్ని పడేశాడు, వారితో సహజీవనం చేసి డబ్బు, నగలుతో జంప్, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విగ్గు రాజు కార్తీక్‌ వర్మ అలియాస్ షేక్‌ మహ్మద్‌ రఫీ

ఇక రెండున్నర నెలల నుంచి కళ్యాణి తల్లి వద్ద ఉంటోంది. సంతోష్‌ ఆత్మహత్య చేసుకునే ముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి కారణమని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను ఇబ్బంది పెట్టారని రికార్డ్‌ చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్‌, బాబాయి భీమ్‌ హత్యాయత్నం చేశారని ఆరోపించాడు.

సంతోష్‌ పురుగుల మందు తాగక ముందు వాట్సాప్‌ వీడియో (in-laws in selfie video) తీశాడు. ఈ వీడియోలో.. అమ్మా.. నన్ను క్షమించు. ఎంతో లైఫ్‌ చూడాలనుకున్నాను. నా కుమారుడికి లైఫ్‌ ఇవ్వాలనుకున్నాను. నా భార్య నన్ను బజారుకీడ్చి అవమానపరుస్తోంది. అభిరాం నన్ను క్షమించు.. ఆస్తిలో నాకు ఎలాంటి హక్కు లేదు. నా సంపాదన అంతా బాబు చికిత్సకు ఖర్చు చేశాను. కవితక్క నన్ను క్షమించండి. మిమ్మల్ని కూడా కాదు అనుకున్నాను. రెండు మూడుసార్లు నాపై హత్యాయత్నానికి ప్రయత్నించారని తెలిపాడు. వాట్సాప్‌ వీడియో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతుడి భార్య, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.