Sex Racket Bust: హైదరాబాద్‌లో హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు, ఉగాండా దేశీయులను అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు, అందరూ వీఐపీలే ఉన్నట్లుగా వార్తలు
Sex Racket Busted. (Photo Credit: PTI)

Hyd, April 21; హైదరాబాద్ నగరంలో కొత్తరకం సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టయింది. హైటెక్‌ రీతిలో సెక్స్‌ రాకెట్‌ను (Sex Racket Bust) నడుపుతున్న ఉగాండా దేశీయులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెక్స్‌రాకెట్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు గుర్తించారు. ఇందులో ఉగాండా దేశీయులతో పాటు అందరూ వీఐపీలే ఉన్నట్లు సమాచారం. బ్యాంక్‌ యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా సెక్స్‌ రాకెట్‌ (Hyderabad police busts high tech sex racket) కోసం ఉగాండా దేశీయులు ( Uganda woman) ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ప్రత్యేక కోడ్‌ వాడితేనే ఎంట్రీ ఉంటుంది. సీక్రెట్‌ కోడ్‌ను ఎంటర్‌ చేస్తేనే విటులను కలిసేందుకు నిర్వాహకులను అనుమతిస్తారు. నగరంలో ఇలాంటి హైటెక్‌ రీతిలో సెక్స్‌ రాకెట్‌ బయటపడటంతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్‌ శివారు ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్, 111 జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు, ఆంక్షలు ఎత్తివేస్తూ కొత్త జీవో జారీ, 84 గ్రామాల్లో వెల్లివిరిసిన ఆనందం

ఇక జీడిమెట్లలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అట్టి గృహంపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్ (28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు