Hyderabad, Jan 7: ఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు (Inter Exam Fee) గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ (Telangana) ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. రూ.2,500 అపరాధ రుసుముతో ఈ నెల 16 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. నిజానికి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగియగా, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
Telangana Inter: తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. ఫీజుల చెల్లింపు గడువు పొడిగింపు#TelanganaInter #Eenadu #TeluguNews https://t.co/X3zjwkFpa4
— Eenadu (@eenadulivenews) January 6, 2025
పరీక్షలు ఎప్పుడంటే?
అనంతరం రూ.2 వేల అపరాధ రుసుముతో జనవరి 2 వరకు మరోసారి అవకాశం కల్పించారు. తాజాగా రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు గడువు పొడిగించారు. కాగా, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరగనున్నాయి.