తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు(Inter Colleges) సెలవులు ప్రకటించింది. ఇంటర్ బోర్డ్ ప్రకటన ప్రకారం.. మార్చి 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకుంటాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, చంచలగూడ జైలుకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ఈ ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. వచ్చే విద్యా సంవత్సరానికి బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.ఇంటర్ బోర్డు ఆదేశాలను పాటించకుండా.. ఏ కాలేజీ అయినా విద్యార్థులకు క్లాస్‌లు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు