Hyd, Sep 12: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన ( KCR Govt Announces) చేశారు. కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ మార్కులు (educe Constable Exam Cut off Marks for SC, ST Candidates) తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, ఈ ఏడాది వెలువడిన కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం అందరికీ ఒకే కటాఫ్‌ను నిర్ధారించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత కోసం అన్ని కేటగిరీలకు 60 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. దీంతో, ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు కటాఫ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కటాఫ్ మార్కులు తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.