అమెరికాలో జిమ్‌లో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ తేజ(24) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అధికారులు సమాచారం అందించారు.. వరుణ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కాగా ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ తేజ్ 2022 ఆగస్టులో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31న వాల్‌పరైసో నగరంలో జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు.
భార్యను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త, కేరళవాసికి జీవిత ఖైదు విధించిన అమెరికా న్యాయస్థానం
తీవ్రగాయాలపాలైన వరుణ్ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి వరుణ్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచాడు. నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అంతేకాదు, ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది