Telangana Weather Update: ఓ వైపు వర్షాలు, మరో వైపు వడగాల్పులు, తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌, రానున్న 5 రోజులు వాతావరణం ఇదే..
Heatwave (Photo Credits: PTI)

Hyd, June 6: తెలంగాణ రాగల ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయని పేర్కొంది.

మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది.

తెలంగాణలో వచ్చే 4 రోజులు మండిపోనున్న ఎండలు, 13 జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రుతుపవనాల రాక ఆలస్యమే కారణం

బుధవారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. అలాగే బుధవారం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో వడగాలు వీస్తాయని పేర్కొంది.

ముంచుకొస్తున్న బైపార్జోయ్ తుఫాను ముప్పు, అరేబియా సముద్రంలో 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం

గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో, శుక్రవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో.. శనివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో వడగాలులు వీచే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.