Rains in Telangana: తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు, కుండపోత వర్షాలతో అల్లాడుతున్న హైదరాబాద్ నగరం, పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం
Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Hyderabad, Sep 19: గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో భారీ వర్షం (Heavy Rains In Telangana) ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి. ఇక తెలంగాణ‌లో మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఉత్త‌ర కోస్తాంధ్ర‌, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది.

ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. రాగ‌ల 24 గంట‌ల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం బ‌ల‌పడే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో రేపు, ఎల్లుండి అనేక చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం (Rains in Telangana) ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు, కొన్ని జిల్లాల్లో ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

ఈటెల ఆఫీసులో కరోనా కలకలం, కోవిడ్‌తో డీఎస్‌ఐ అబ్బాస్‌ అలీ మృతి, తెలంగాణలో తాజాగా 2,123 మందికి కరోనా పాజిటివ్, 11 మంది మృతితో 1,025కి చేరుకున్న మరణాల సంఖ్య

నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్‌, వనస్థలీపురం, హయత్‌ నగర్‌, అబ్దుల్లాపూర్‌ మేట్‌, దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, సరూర్ నగర్, కర్మన్‌ఘాట్, కొత్తపేట్, మీర్‌పేట్, కీసర, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నాగారం, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అనేకచోట్ల ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పలుచోట్ల నాలాలు పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు ఇప్పటివరకూ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు 38 ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సూచించారు. ముఖ్యంగా ఎల్బీ నగర్,కూకట్ పల్లి జోన్లులో అధికంగా వర్షం అవకాశం ఉండటంతో సిబ్బంది మరింత అలెర్ట్ గా ఉండాలని లోకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.