Coronavirus | Representational Image (Photo Credits: ANI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, నల్గొండ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 18, ఖమ్మం జిల్లాలో 17 కేసులను గుర్తించారు. నిర్మల్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 296 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,906 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,938 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,907కి పెరిగింది.