Telangana: బీజేపీ సభలో కేసీఆర్ నామస్మరణ తప్ప ఏమీ లేదు, ప్రధాని మోదీ సర్కారుపై విరుచుకుపడిన ఆర్థికమంత్రి హరీశ్ రావు, బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని వెల్లడి
Harish rao (Photo-TRS Twitter)

Hyd, July 4: ప్రధాని మోదీ సర్కారుపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని మంత్రి హరీష్‌ విమర్శించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి ఏమైనా దశ దిశ చూపిస్తారని అనుకున్నామని, కానీ సభల్లో కేసీఆర్‌ నామస్మరణ తప్ప వేరే లేదన్నారు. తెలంగాణకు ఏం చేస్తారో ఒక్క బీజేపీ నాయకుడూ చెప్పలేదని ( minister harish rao counter to pm narendra modi) మండిపడ్డారు.

18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు (18 States CMs) హైదరాబాద్‌ వచ్చారని, తమ రాష్ట్రంలో తెలంగాణ కన్నా అద్భుతమైన పథకాలు ఉన్నాయని ఒక్కరైనా చెప్పగలిగారా అని ప్రశ్నించారు. తెలంగాణలో లక్ష కోట్ల రూపాయల పంట కొన్నామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో (Telangana) సాగునీరు అందుతుందో లేదో రైతుల్నే అడుగుదామన్నారు. నీళ్లు ఇవ్వకుండానే పంట పండకుండానే లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు కోట్ల టన్నుల ధాన్యం అదనంగా పండిందన్నారు. పంజాబ్‌ తరువాత ఎక్కువ వరి పండించిన రాష్ట్ర తెలంగాణేనని నీతి ఆయోగే చెప్పిందన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాస్త రెండు కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు.

మోదీజీ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమేదీ! తెలంగాణకు వరాలేవి? మరోసారి మొండిచెయ్యి ఎందుకిచ్చారంటూ నిలదీసిన మంత్రి హరీష్ రావు

సాగునీరు పారకపోతే ఇంత ధాన్యం ఎక్కడ నుండి పండిందని ప్రశ్నించారు. కేసీఆర్ దూరదృష్టితో సాగునీటి ప్రాజెక్టులు కడితేనే దాన్య రాశులు పెరిగాయని అన్నారు. అతి తక్కువ కాలంలో వృద్ధి రేటులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. నీళ్లు వచ్చాయా అని అమిత్ షా అడగటం వల్ల ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు.

మంత్రి టి. హరీష్ రావు సంధించిన ప్రశ్నలు

...రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి తెలంగాణ కు ఎదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది

..అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు

...విభజన చట్టం హామీల ఊసే లేదు

..18 రాష్ట్రాల సీఎం లు వచ్చారు. తెలంగాణ కంటే ఎక్కువ ఏం చేశారో చెబుతారనుకున్నాం

...బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు అని మరోసారి రుజువైంది

...అమిత్ షా నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడారు

...నీళ్లు నిధులు నియామకాలు వచ్చాయని ఎవరిని అడిగినా చెబుతారు

..ఏ జిల్లాకు అయినా వెళదాం పదండి నీళ్లు ఎలా వచ్చాయో తెలుస్తుంది

...అమిత్ షా రండి నాతో పాటు చూపిస్తా నీళ్లు ఎలా వచ్చాయో

..కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ల ఖిలా గా మారింది

..నీళ్లు రాక పోతే మోడీ లక్ష కోట్ల రూపాయల విలువైన ధాన్యం తెలంగాణ నుంచి ఎలా కొన్నామంటారు

...పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం పండించింది తెలంగాణే అని నీతి ఆయోగ్ లెక్కలు చెబుతున్నాయి

...2కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యం నీళ్లు రాక పోతే ఎలా పండుతుంది అమిత్ షా

..ఉమ్మడి ap లో ఇంతటి ధాన్యం ఎందుకు పండలేదు

...నీళ్లు వచ్చాయా రాలేదా అని ఏ రైతు నైనా అడుగు లేదు ఇంటలిజెన్స్ రిపోర్ట్ తెచుకో అమిత్ షా

..వ్యవసాయం లో తెలంగాణ 10 శాతం వృద్ధి రేటు పెరిగిందని నీతి యోగ్ లెక్కలు చెబుతున్నాయి

..గత సంవత్సరం లో 21 శాతం వృద్ధి రేటు నమోదయింది.. జాతీయ స్థాయి లో 3 శాతం మాత్రమే నమోదయింది

...నిజాలు చెప్పక అమిత్ షా అభాసు పాలయ్యారు.స్థాయి తగ్గించుకున్నారు

..ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు

...అమిత్ షా తన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులను అవమానించారు

...నిధులు వచ్చింది నిజం, నియామకాలు జరిగాయన్నది నిజం

..మేము ఏదీ చెప్పినా ఆధారాలతో చెబుతాం

..నిధులు ఖర్చు పెట్టనిదే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఎలా పూర్తవుతాయి

...తలసరి ఆదాయం ఇపుడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగింది

..gdp 11 లక్షలకోట్ల కు పెరిగింది. నిధులు ఖర్చు పెట్టక పోతే ఇది సాధ్యమా

...దేశ gdpకి తెలంగాణ ఒక శాతం అదనంగా సమకూర్చింది

..తెలంగాణ వాటా 4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది

...సంపద పెంచాం గనుకే తెలంగాణ లో సంక్షేమం డబుల్ ఇంజిన్ సర్కార్ ల కన్నా ఎక్కువ ఉంది

...యూపీ తలసరి ఆదాయం మన కన్నా మూడు రెట్లు తక్కువ

..కేసీఆర్ సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ కన్నా ఎక్కువ ప్రగతి చేస్తున్నాం

...రైతు బంధు తీసుకున్న రైతును అడిగితె తెలుస్తుంది.. కళ్యాణ లక్ష్మీ చెక్కు తీసుకున్న మహిళను అడుగు అమిత్ షా

...తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి 11 లక్షల హెక్టార్లలో కోట్ల రూపాయలు వివిధ రంగాల పై ఖర్చు పెట్టాం

...నీతి ఆయోగ్ చెప్పినట్టు మిషన్ భగీరథకు నిధులు ప్రకటిస్తారని ఆశించాం.నిధులు ఇవ్వకుండా తిట్లు మాత్రం ఇచ్చారు

...మాకు న్యాయ బద్దంగా రావాల్సిన నిధులు ఇస్తే తెలంగాణ మరింతగా దూసుకు పోయేది

...ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు ను బుట్ట దాఖలు చేసిన ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వం

...నియామకాలు జరిగాయా అని ప్రశ్నిస్తున్న అమిత్ షా బీజేపీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడరు

...దమ్ముంటే 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో అమిత్ షా శ్వేత పత్రం విడుదల చేయాలి

...16న్నర లక్షల ఉద్యోగాలు కేంద్రం లో ఖాళీగా ఉంటే ఎన్ని నింపారు

..మీరు నింపరు.. నింపిన మమ్మల్ని అడుగుతారా

...లక్షన్నర ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేశాం. లక్షా 32 వేలు భర్తీ చేశాం.91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది

...తెలంగాణ ఉద్యమాల గడ్డ అమిత్ షా ఎదో చెబితే నమ్మడానికి సిద్ధంగా ఎవరూ లేరు

...పీఎం మోడీ కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నాము అని అబద్ధం ఆడారు

...తెలంగాణ ప్రతీ ఏటా 4246 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది

.ఈ డబ్బులను తెలంగాణ కు ఇచ్చేస్తారా చెప్పాలి

...ఆయుష్మాన్ భారత్ కు వెచ్చిస్తోంది కేవలం 170 కోట్లే.. ఆరోగ్య శ్రీ కి మేము వెచ్చిస్తోంది 900 కోట్లు

....85 లక్షల మంది కి ఆరోగ్య శ్రీ వర్తిస్తే కేవలం 26 లక్షల మంది కే ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది

...మహిళల గురించి ఎదో గొప్పగా మోడీ మాట్లాడారు

..మహిళకు కన్నీళ్లు తెప్పిస్తున్న సీలిండర్ ధర పెంచిన విషయం ఎందుకు చెప్పలేదు మోడీ

...మహిళా రిజెర్వేషన్ల విషయం ఎందుకు మోడీ మాట్లాడలేదు

...సాగు నీటి ప్రాజెక్టులకు సాయం చేశామన్నారు .చేయక పోగా అడ్డంకులు సృష్టిస్తున్నారు

...ప్రాజెక్టు ల్లో అవినీతి జరిగిందని అన్యాయంగా మాట్లాడుతున్నారు

...కాళేశ్వరం ప్రాజెక్టు కు అనుమతులిచ్చి 80 వేల కోట్ల రుణానికి ఆమోదించింది కేంద్రం కాదా

..పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం లో అవినీతి జరగలేదని కేంద్రమంత్రి చెప్పారు కదా

..కరెంటుమోటర్లకు మీటర్లు పెట్టాలను కునే వారికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఎలా అర్థమవుతుంది

..బీజేపీ వారికి atm అంటే ఎనీ టైం మీటర్.. కాళేశ్వరం మా దృష్టిలో ఎనీ టైం వాటర్

...అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది

...రూపాయి విలువ తగ్గిస్తామన్నారు పెంచి ఫెయిల్ అయ్యారు

...నల్ల ధనం తెస్తామన్నారు.. ఫెయిల్ అయ్యారు

..లోక్ పాల్ బిల్లు తెస్తామన్నారు ఫెయిల్ అయ్యారు

...తీవ్రవాద నియంత్రణ లో ఫెయిల్ అయ్యారు

...ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ వైఫల్యాల జాబితా చాంతాదంతా ఉంటుంది

.. విభజన చట్టం హామీల ఊసే లేదు

...ఎనిమిదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీకి దిక్కు లేకుండా పోయింది

.రైల్ కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు మహారాష్ట్ర లాతూర్ కీ తీసుకెళ్లారు

...ఎస్టీ రిజెర్వేషన్ల పెంపు ఊసు లేదు

..గిరిజన విశ్వవిద్యాలయం మాటే లేదు

...ఎస్సీ వర్గీకరణ మాటే చెప్పలేదు

...తెలంగాణ ఉద్యమం లో బీజేపీ తన పాత్ర గురించి గొప్పగా చెప్పుకుంటోంది.. ఉద్యమం లో బీజేపీ పాత్ర ఏమిటి

...కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయారు

...తెలంగాణ ఉద్యమం లో త్యాగాల విలువ బీజేపీ ఎం తెలుసు

...తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పై నిన్న కూడా అమిత్ షా విషం గక్కారు

...మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ను బీజేపీ ఎందుకు ఇవ్వలేకపోయింది

.తెలంగాణ మీద ప్రేముంటే బీజేపీ విభజన చట్టం హామీలు ఎందుకు అమలు చేయడం లేదు

...మాకు తెలంగాణ ప్రజలే బాస్ లు .మాకు బాస్ లు ఢిల్లీ లో లేరు

...ప్రజలే అంతిమ నిర్ణేతలు

..బండి సంజయ్ కేసీఆర్ ను ఎవరు అని అడగడాన్ని తెలంగాణ సమాజం హర్షించదు

...పచ్చటి పొలాలను మత్తడి దుంకుతున్న చెరువులను అడిగితే కేసీఆర్ ఎవరో చెబుతాయి

..స్థాయి మరిచి మాట్లాడటం మంచిది కాదు

...పీఎం మోడీ సైన్స్ హబ్ పై చెప్పేవి ఉత్త ముచ్చట్లే

...కేసీఆర్ అంకిత భావం వల్లే తెలంగాణ దూసుకు పోతోంది

...మోడీ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు అని యశ్వంత్ సిన్హా చెప్పారు కదా