Hyderabad, Dec 9: ఎనిమిదేండ్ల క్రితం విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు (Telugu States) తిరిగి కలిస్తే మొదట స్వాగతించేది వైసీపీయేనని (YSRCP) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్రంగా స్పందించారు. విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన (Foolish Argument) అని స్పష్టం చేశారు. ఒకవేళ సజ్జల చెప్పినట్టే జరిగితే ఏపీ కావాలని మద్రాస్ (Madras) వాళ్లు, భారతదేశం కావాలని ఇంగ్లండ్ మళ్లీ అడగొచ్చని దుయ్యబట్టారు.
సజ్జల చేసిన ఈ తరహా వ్యాఖ్యలన్నీ అర్థం లేని వాదనలని, మీడియా సంచలనాల కోసం తప్ప ఈ వాదనతో ఎవరికీ ప్రయోజనంలేదని హితవు పలికారు. చరిత్రను వెనక్కి తిప్పడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. నాడు తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాను బలవంతంగా కలిపారని, 60 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం తనను తాను ఆవిష్కరించుకుందని పేర్కొన్నారు.