Hyd. Dec 6: హైదరాబాద నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ (minister-ktr) కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్‌గా పేరున్న ఎల్‌బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు రూట్‌ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం నాగోల్-ఫిర్జాదిగూడ లింక్ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు (route extension up to Hayat Nagar)ఉండనుందని తెలిపారు.
అంతేకాదు.. నాగోల్-ఎల్‌బీ నగర్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు.
అభివృద్ధి సంక్షేమమే రెండు లక్ష్యాలుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణలో పాలన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలో రూ.55కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఓ వైపు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందేలా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో రకాల పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభుత్వం ఆదుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. మరో వైపు అభివృద్ధి కొత్త నమూనాను భారతదేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణ, అభివృద్ధి, పరిశ్రమలు -పర్యావరణం, వ్యవసాయం – ఐటీ సమతుల్యమైన కొత్త ఇంటిగ్రేటెడ్ హెలిస్టిక్ మోడల్‌ను భారతదేశం ముందు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రవేశపెట్టిందన్నారు.
సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!
తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. జీఎస్‌డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6లక్షల కోట్లని, ఈ రోజు 11.55లక్షల కోట్లుగా ఉందన్నారు.ఎస్‌ఎన్‌డీపీ పథకం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 పనులు తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందులో రెండు పూర్తయ్యాయని, డిసెంబర్ చివరి నాటికి 17 పనులు పూర్తి చేస్తామన్నారు. మరో 15 పనులు జనవరి వరకు పూర్తి చేస్తామన్నారు.
హుస్సేన్ సాగర్ సర్ఫేస్ నాలా, బుల్కాపూర్ నాలా ఎండాకాలం వరకు పూర్తి చేస్తామన్నారు. రూ.985 కోట్లతో పనులు చేపడుతున్నామని, ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్‌బీసీ నగర్ చౌరస్తా రూపు రేఖలు ఎలా మారాయో.. ఎస్‌ఎన్‌డీపీ కింద నగరం నలుమూలలా ఉండే నానాల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితో రూ.985కోట్లతో మొదటి దశలో పనులు చేపట్టామన్నారు. ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులు చేపడుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తుందని, ఐటీ పరిశ్రమలు, ఇండస్ట్రీలు వస్తున్నాయన్నారు.