TRS Party working president, Telangana IT Minister KTR | Photo: Twitter

Hyderabad, May 18: వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కేటీఆర్ (KT Rama Rao) సరికొత్త పోగ్రాంను ప్రారంభించారు. సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రతను పాటిద్దామని ఇందుకోసం ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ (10 minutes at 10 am every Sunday) అనే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో 1551కి పెరిగిన కోవిడ్-19 కేసులు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఆకస్మిక భేటీ, లాక్‌డౌన్ 4.0 తాజా మార్గదర్శకాలపై చర్చ

దీనిని ఓ సామాజిక కార్యక్రమంగా భావించేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రజాప్రతినిధుల సహకారం కోరుతున్నామని, వారి ఇండ్లనుంచే ఈ కార్యక్రమం ప్రారంభంకావాలని ఆయన కోరారు.

సీజనల్‌ వ్యాధుల నివారణలో పురపాలకశాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించి, వాటిని అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రి కేటీఆర్‌ తెలంగాణ (Telangana) ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో అలవాటైన వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించి వ్యాధులను దరిచేరకుండా చూద్దామన్నారు.

రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూద్దామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రాసిన లేఖలో మంత్రి పేర్కొన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.ప్రతి వర్షాకాలంలో అనేక సీజనల్‌ వ్యాధులు మనల్ని పట్టిపీడిస్తున్న విషయం తెలుసని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Here's Dasyam Vinaya Bhaskkar Tweet 

దోమల నివారణ కోసం కొన్ని జాగ్రత్తలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించే అవకాశం మన చేతుల్లోనే ఉన్నదన్నారు. దోమల నివారణ కార్యక్రమాల్లో భాగంగా స్ప్రే, మలాథియాన్‌ ఆయిల్‌ బాల్స్‌, ఫాగింగ్‌ చేయాలని సూచించామన్నారు. దీంతోపాటు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణ స్ప్రే సైతం వారానికోసారి చేయనున్నామని తెలిపారు. మురికి కాల్వల పూడికతీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ఎత్తిపోయడంవంటి కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చేపట్టాలని పురపాలక సంఘాలకు ఆదేశాలిచ్చామని వివరించారు.

Here's Deputy Commissioner, Malkajgiri Circle Tweet

ప్రజలను, పట్టణాలను కాపాడుకొనే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రానున్న పది వారాలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇండ్లు, పరిసరాల్లో దోమలు నిలిచేందుకు ఆస్కారమున్న వాటిని శుభ్రం చేసుకోవడం, యాంటి లార్వా కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా లేఖలో కోరారు. ఎమ్మెల్యేలు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇండ్లనుంచే ప్రారంభించాలని సూచించారు.