IT Minister kTR (Photo-Twitter)

Hyd, July 29: కేంద్రం ఐటీఐఆర్‌ రద్దు చేసిన సంగతి విదితమే. దీనిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) మండిపడ్డారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు ( ITIR project cancellation) చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు.

బీజేపీ డీఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్ధాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్న కేటీఆర్, ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఏమీ లేదన్నారు.

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదని ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్

2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరె హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా మూలకుపెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్ గురించి అడిగామన్న కేటీఆర్, ఎన్నిసార్లు కోరినా తోలుమందం కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. మోడీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని గుర్తించినంకనే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరమన్నారు కేటీఆర్. అయినా కూడా మోదీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టమ్‌కు నయా పైసా మందం సహాయం చేయలేదని కేటీఆర్ విమర్శించారు.