Election Commission of India. File Image. (Photo Credits: PTI)

Munugode, Oct 3: తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.

నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గానికి ఎన్నిక జరుగనున్నది.