Hyderabad, June 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర గీతాన్ని (Telangana official  anthem) ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ప్ర‌సంగం అనంత‌రం జ‌య జయ‌హే తెలంగాణ అంటూ సాగే రాష్ట్ర గీతాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. 2 నిమిషాల‌కు పైగా సాగే ఈ గేయానికి (Telangana State anthem) క‌వి అందెశ్రీ (Andesri) సాహిత్యం అందించ‌గా, ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. ఈ గేయానికి కీర‌వాణి (MM Keeravani) మ్యూజిక్ అందించ‌డంపై ముందు నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

 

అయిన‌ప్ప‌టికీ అవేమీ ప‌ట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ముందుకు వెళ్లింది. చివ‌ర‌కు గేయాన్ని విడుద‌ల చేసింది. దశాబ్ది ఉత్స‌వాల్లో రాష్ట్ర గేయాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ గేయం ఆల‌పిస్తుండ‌గా..క‌వి అందెశ్రీ భావోద్వేగానికి గుర‌య్యారు. ఆనందంతో ఉప్పొంగి క‌నిపించారు.