Gambling Racket Busted in TS: తెలుగు సినిమా హీరో ఫాంహౌస్‌లో పేకాట, 30 మంది అరెస్ట్, 1315/2021 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు
Gambling Racket Busted in TS (Photo-Twitter/Video grab)

Hyd, Nov 1: హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పేకాట ఆడుతుండ‌గా (Gambling Racket Busted in TS) ప‌లువురిని పోలీసులు ప‌ట్టుకున్నారు. టాలీవుడ్ హీరోకు చెందిన ఈ ఇంటిని ( Actor's Farm House) లీజుకు తీసుకుని పేకాట క్ల‌బ్‌ను న‌డుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నగరానికి చెందిన సుమన్‌ కుమార్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ పేకాట స్థావరాన్ని గత రెండు రోజులుగా నిర్వ హిస్తున్న‌ట్లు తేలింది. ఈ మేరకు సుమన్‌కుమార్‌తో పాటు 30 మందిపై కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అన్వేష్‌రెడ్డి తెలిపారు.

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద టాలీవుడ్ హీరో నౌగశౌర్య తండ్రికి చెందిన ఫాంహౌస్ ఉంది. నాలుగు రోజుల పాటు ఈ ఫాంహౌజ్‌ను వాడుకుంటామని సుమంత్‌ చౌదరి అనే పేరిట బుక్‌ చేసుకున్నారు. తరచూ గోవాలోని కాసినోలకు వెళ్లేవారిని సంప్రదించి ఇక్కడికి ఆహ్వానించారు. కాసినోల తరహాలో టేబుళ్లు, కాసినో కాయిన్లు, వందల పేకాట బాక్సులు, క్యాష్‌ కౌంటింగ్‌ మిషిన్లు, మద్యం, భోజన సదుపాయాలు వంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంపై శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందడంతో.. ఆదివారం రాత్రి దాడి చేశారు.

ఫామ్‌హౌజ్‌లోని పేకాట స్థావరంలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన 30మందిని అదుపులోకి తీసుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. 6.70 లక్షల నగదు, మూడు కార్లు, 33 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం.

పేకాట స్థావరంలో అదుపులోకి తీసుకున్నవారి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. వారిని రిమాండ్‌కు పంపే సమయంలో వివరాలు వెల్లడిస్తామని నార్సింగి సీఐ శివకుమార్‌ తెలిపారు. నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య పట్టుబడ్డారు. మహబూబాబాద్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా (Arrested Including Ex-mla) భద్రయ్య పనిచేశారు. ఆయనతోపాటు వాసవీ డెవలపర్స్‌ రాజారాం, మరో రియల్టర్‌ మద్దుల ప్రకాశ్‌ అరెస్టయ్యారు.

మోదీని టార్గెట్ చేస్తూ వ‌రుస బాంబు పేలుళ్లు, పాట్నా గాంధీ మైదాన్ సీరియల్ బ్లాస్ట్ కేసులో న‌లుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధించిన ఎన్ఐఏ కోర్టు, ఇద్ద‌రికి జీవిత‌కాల శిక్ష‌, మ‌రో ఇద్ద‌రికి 10 ఏళ్ల జైలుశిక్ష

ఈ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఫామ్‌హౌజ్‌లో దొరికిన గుత్తా సుమన్‌ చరిత్ర మొత్తాన్ని ఓస్‌ఓటీ పోలీసులు బయటకు లాగుతున్నారు. సుమన్‌ చౌదరి ఫోన్‌లో పలువురు వీఐపీల నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెజవాడ, హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు.. ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులతో సుమన్‌కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుత్తా సుమన్‌ ఫామ్‌ హౌజ్‌లను అద్ధెకు తీసుకొని పేకాట ఆడిస్తుంటాడని, విజయవాడలోని మామిడి తోటలో గుత్తా సుమన్‌ పేకాట క్లబులు ఉన్నట్లు తెలుస్తోంది. సుమన్ చౌదరిపై విజయవాడ లో భూ కబ్జా కేసు కూడా నమోదైంది. బడా రాజకీయ నేతలతో ఫొటోలు దిగి తనకు పరిచయాలు ఉన్నాయని ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఎన్జీవో పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

కట్టెల పొయ్యిలే బెటరా, వీధి వ్యాపారులకు మళ్లీ గ్యాస్ పోటు, తాజాగా 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 266 కు పెంపు

ఈ కేసులో పట్టుబడ్డ 30 మంది నిందితులను ఉప్పరపల్లి కోర్టులో హాజరపరచనున్నారు. వీరిపై 1315/2021 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తెలంగాణ స్టేట్‌ గేమింగ్‌ యాక్ట్‌ 3,4 కింద కేసులు నమోదు చేశారు. అయితే బర్త్ డే పార్టీ పేరుతో విల్లాను సుమన్‌ అద్దెకు తీసుకోగా.. రవీంద్ర ప్రసాద్‌కు తెలిసే జూదం జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.