Telangana State Police. Credits: Facebook

Hyd, Feb 9: ఎత్తు కారణంగా అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (Telangana Police Recruitment) మరో అవకాశం కల్పించనుంది.ఒక సెంటీమీటర్, ఆ లోపు తేడాతో అనర్హులైన అభ్యర్థులకు (who are disqualified by one centimeter or less) మరోమారు ఎత్తు కొలతలు తీయా­లని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు

ఎత్తు కొలతలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌ ఈనెల 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు లాగిన్‌ ఐడీల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ( V V Srinivasa Rao) సూచించారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ అంబర్‌పేట్, 8వ బెటాలియన్‌ కొండాపూర్‌లలో ఈ ఎత్తు కొలతలను తీయనున్నట్లు వెల్లడించారు. భౌతిక కొలతలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను తీసుకురావాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా వినతిపత్రాలు రాసి తెచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.