Hyderabd, OCT 22: మునుగోడు ఉపఎన్నిక (Munugode Bypoll) వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు ( Rs 1 crore cash ) దొరికింది. కోకాపేట నుంచి మునుగోడుకు (Munugodde) తరలిస్తుండగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి అందజేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. కోటి రూపాయల నగదును మూడు భాగాలుగా చేసి మూడు కార్లలో దేవల్ రాజ్ అండ్ గ్యాంగ్ తరలిస్తోంది. ఈ క్రమంలో నార్సింగి దగ్గర పోలీసుల తనిఖీలు చూసి దేవల్ రాజ్ అండ్ గ్యాంగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చాకచాక్యంగా వ్యవహరించిన నార్సింగి పోలీసులు దేవల్ రాజ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.
దేవల్ రాజ్, శ్రీకాంత్, సాగర్, విజయ్, నాగేశ్ ను అరెస్ట్ చేశారు. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి పవన్ రెడ్డి వద్దకు డబ్బు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు పేర్కొన్నారు. కోకాపేట వాసి సునీల్ రెడ్డి నుంచి రూ. కోటి తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి వెళ్లే దారుల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోటి రూపాయల నగదుతో పాటు రెండు కార్లు, ఓ బైక్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.