Komatireddy Raj Gopal Reddy

Hyd, July 23: తెలంగాణలో బీజేపీలో రోజు రోజుకు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి ఇచ్చింది.

కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో, ఇకపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ పదవి, జాక్ పాట్ కొట్టిన కోమటి రెడ్డి అంటున్న సన్నిహితులు

2023 తెలంగాణ ఎన్నికలే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని, భాజపా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా చేరికల కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఇప్పటికే అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే.