MLA Bandla Krishnamohan Reddy Meets CM Revanth Reddy(X)

Hyd, Aug 2: ఫిరాయింపులు , బుజ్జగింపులు వెరీసీ తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి బీఆర్ఎస్ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే ఇంట్లో టిఫిన్ చేస్తూ జరిగిన చర్చల ఫలితం 24 గంటలు గడవక ముందే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీంతో బండ్ల - రేవంత్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

వాస్తవానికి మంత్రి జూపల్లితో బండ్ల భేటీ సందర్భంగా స్పష్టమైన హామీ పొందినట్లు తెలుస్తోంది. అందుకే ఈ భేటీ అనంతరం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడలేదని వెల్లడించారు జూపల్లి. అసెంబ్లీ కారిడార్‌లో బండ్లకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కనిపిస్తే పాత పరిచయం కొద్ది వారితో మాట్లాడారని చెప్పారు. పార్టీలో ఎవరి గౌరవం వారికి ఉంటుందని ..అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఎమ్మెల్యేను కలిసినట్టు చెప్పారు.

ఇది జరిగిన కొద్ది గంటల్లోనే సీఎం రేవంత్‌తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అవడంతో ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. త్వరలోనే మరికొంతమంది చేరుతారని మళ్లీ ప్రచారం జోరందకుంది. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తి ఉండనుండటంతో చేరికలు ఖచ్చితంగా ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటన.. తెల్ల రేషన్‌ కార్డులు జారీపై కూడా కీలక ప్రకటన