Hyd, July 8: తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్
రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు, రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువవచ్చునని తెలిపింది.హైదరాబాద్‌లోనూ పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.