Representational Image | (Photo Credits: PTI)

Hyd, April 21: భాగ్యనగరంలో పలుప్రాంతాల్లో అనుకోకుండా భారీ వర్షం పడింది. వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం (Rainfall in Several parts) కురిసింది. యూసఫ్‌గూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఫిల్మినగర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పగటిపూట వేసవి తీవ్రత దారుణంగా ఉంటుండగా... సాయంత్రం వేళ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయమంతా ఉష్ణోగ్రతల ప్రభావంతో... ఉక్కపోతతో సిటీ ప్రజలు (Hyderabad) అల్లాడిపోతున్నారు. సాయంత్రం పూట గాలీవాన బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఇక రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు సూచించారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌స్తే గొడుగు ఉప‌యోగించాల‌న్నారు. లేదా త‌ల‌కు ఏదైనా బ‌ట్ట చుట్టుకోవాల‌ని సూచించారు. న‌లుపు రంగు దుస్తులు ధ‌రించ‌కుండా, లేత రంగు దుస్తులు, కాట‌న్ వ‌స్త్రాలు ధ‌రించాల‌ని చెప్పారు.

తెలంగాణలో ఫోర్త్‌ వేవ్‌ అలర్ట్, మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. వెయ్యి జ‌రిమానా, ప్రతీ ఒక్కరూ తప్పక మాస్క్ ధరించాలని తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

ఎండా కాలంలో డీ హైడ్రేష‌న్ జ‌ర‌గ‌డం సాధార‌ణమ‌ని డీహెచ్ పేర్కొన్నారు. అయితే ప్ర‌తి రోజు 2.5 లీట‌ర్ల నుంచి 4 లీట‌ర్ల నీళ్లు తాగాలి. మ‌ద్యపానం వ‌ల్ల డీ హైడ్రేష‌న్ అధికంగా జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌జ్జిగ‌, కొబ్బ‌రినీళ్లు త‌రుచుగా తీసుకోవ‌డం మంచిది. మ‌సాలాలు, వేపుళ్లు త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావు అని శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు.

వ‌డ‌దెబ్బ త‌గిలిందంటే చెమ‌ట ప‌ట్ట‌దు.. నాలుక‌, పెదాలు ఎండిపోతుంటాయి. బాగా నీర‌సంగా అయిపోతారు. హార్ట్ బీట్ అధికంగా ఉంటుంది. క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి. జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ప్రాణాల‌కు ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది. చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో ఉండాలి. వ‌డ‌దెబ్బ త‌గిలింద‌ని ఒకేసారి లీట‌ర్ల కొద్ది నీళ్లు తాగొద్దు. నెమ్మ‌దిగా నీళ్లు తీసుకోవాలి. గాలి, వెలుతురు త‌గిలేలా చూసుకోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని డీహెచ్ సూచించారు.