Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Hyderabad, April 11: తెలంగాణలో తాజాగా 3,187 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (Telangana coronavirus) అయింది. ఒక్క‌రోజులో కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 787 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278కి (TS Covid Report) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,05,335 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,759గా (Covid Deaths) ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 20,184 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 13,366 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 551 మందికి క‌రోనా సోకింది.

మొదటివేవ్‌ పీక్‌లోకి రావడానికి ఆరేడు నెలలు పడితే, సెకండ్‌వేవ్‌ ( Telangana Second Wave)ఆ స్థాయికి చేరుకోవడానికి 2 నెలలు కూడా పట్టలేదు. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. మరోవైపు కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటున్నవారి సంఖ్య ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు శనివారం ఉదయం కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.

Here's TS Coronavirus Report

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌(టూ, త్రీ వీలర్‌) దుకాణాలు సాయంత్రం గం.6:30లకే మూసివేయాలని అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వీటిని అందరూ పాటించాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.