Hyderabad, May 16: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్ కేసులు (TS Coronavirus Update) నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో మరో 5,892 మంది చికిత్సకు కోలుకున్నారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,28,823కు పెరిగాయి. యాక్టివ్ కేసులు 50,969కి చేరాయి. వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా 2,955 మంది ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు.ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వి రెండో బ్యాచ్ నేడు హైదరాబాద్ చేరుకుంది. ఈ నెల 1న తొలి బ్యాచ్ టీకాలు రాగా శుక్రవారం నుంచి వాటిని వేస్తున్నారు. ఇప్పుడు రెండో బ్యాచ్ టీకాలు నగరానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుదషెవ్ తెలిపారు. కరోనాపై భారత్-రష్యా పోరుకు, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, భారత్‌లో వేస్తున్న తొలి విదేశీ తయారీ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్-వి రికార్డుకెక్కింది.
Here's TS Covid Update
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.16.05.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Rvm4Z36Bml
— IPRDepartment (@IPRTelangana) May 16, 2021
కుదషెవ్ మాట్లాడుతూ సరైన సమయానికి వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకున్నాయన్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కరోనా టీకాలతో పోలిస్తే స్పుత్నిక్ టీకా ప్రభావశీలత ఎక్కువగా ఉన్నట్టు తేలింది. రష్యాలో దీనిని గతేడాది రెండో అర్థభాగం నుంచే ఇస్తున్నారు. ఈ టీకా కరోనాలోని కొత్త స్ట్రెయిన్లను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని రాయబారి చెప్పారు. భారత్‌లో స్పుత్నిక్-వి టీకాల ఉత్పత్తిని క్రమంగా సంవత్సరానికి 850 మోతాదులకు పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్‌తో తమ ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
త్వరలోనే సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్‌ను కూడా భారత్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని కుదషెవ్ తెలిపారు. స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి ఏప్రిల్ 12న భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.