COVID19 in TS: తెలంగాణలో పాస్‌పోర్ట్ సేవలు పునరుద్ధరణ; రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన సెకండ్ వేవ్ కరోనా.. కొత్తగా 1798 పాజిటివ్ కేసులు నమోదు, 24 వేల దిగువకు ఆక్టివ్ కేసులు

లాక్‌డౌన్ కారణంగా గత నెల 12న నిలిచిపోయిన పాస్‌పోర్ట్ సేవలు గురువారం ఎప్పట్లాగే సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించింది. ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే..

COVID19 in TS: తెలంగాణలో పాస్‌పోర్ట్ సేవలు పునరుద్ధరణ; రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన సెకండ్ వేవ్ కరోనా.. కొత్తగా 1798 పాజిటివ్ కేసులు నమోదు, 24 వేల దిగువకు ఆక్టివ్ కేసులు
Coronavirus Outbreak, . Representational Image | (Photo Credit: PTI)

Hyderabad, June 10: లాక్‌డౌన్ తర్వాత తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. రాష్ట్రంలో కేసులు తగ్గుతుండటంతో లాక్డౌన్ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపులను ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో, వివిధ రకాల సాధారణ పౌరసేవలు ఇప్పుడు పూర్తిగా అందుబాటులో వచ్చాయి. ఇందులో భాగంగానే పోస్టాఫీసుల వద్ద పాస్‌పోర్ట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా గత నెల 12న నిలిచిపోయిన పాస్‌పోర్ట్ సేవలు గురువారం ఎప్పట్లాగే సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించింది.

ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,30,430 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1798 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1266 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,98,611కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 174 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 165, నల్గొండ నుంచి 151 మరియు రంగారెడ్డి నుంచి 107 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 14 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,440కు పెరిగింది.

అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 2,524 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,71,610 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,561 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jun 10, 2021 07:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).