Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2932 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,17,415కి చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య, 799కు పెరిగిన కరోనా మరణాలు

జిల్లాల్లో అయితే కరోనా వేగంగా విస్తరిస్తోంది, ఎక్కడో దూరంగా ఉండే మారుమూల పల్లెలకు కూడా వైరస్ పాకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ అంతం ఇంకా ఎప్పుడో అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.....

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2932 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో  1,17,415కి చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య, 799కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Outbreak in India (Photo-PTI)

Hyderabad, August 28: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 61,863 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,932 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 771 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,04,343 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,17,415కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 520 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అటు మేడ్చల్, రంగారెడ్డిలలో కూడా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన ఒక్కరోజులో ఈ రెండు జిల్లాల పరిధుల్లో చెరో 218 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇక జిల్లాల్లో అయితే కరోనా వేగంగా విస్తరిస్తోంది, ఎక్కడో దూరంగా ఉండే మారుమూల పల్లెలకు కూడా వైరస్ పాకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ అంతం ఇంకా ఎప్పుడో అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల,  సూర్యాపేట మరియు సిద్ధిపేట జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 27న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 788 కు పెరిగింది.

అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 872 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 86,095 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 28, 2020 08:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).