COVID19 in Telangana: నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో నాన్-కోవిడ్ వైద్యసేవలు తిరిగి అందుబాటులోకి; తెలంగాణలో కొత్తగా 609 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,777కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి నాన్ కోవిడ్ వైద్య సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత నేటి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ మరియు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి నాన్-కోవిడ్ సేవలను ప్రారంభించారు.....

COVID19 in Telangana: నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో నాన్-కోవిడ్ వైద్యసేవలు తిరిగి అందుబాటులోకి; తెలంగాణలో కొత్తగా 609 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,777కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Image of Gandhi Hospital, COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, August 3: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి నాన్ కోవిడ్ వైద్య సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.  దాదాపు నాలుగు నెలల విరామం తరువాత నేటి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ మరియు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి నాన్-కోవిడ్ సేవలను ప్రారంభించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో గాంధీ ఆసుపత్రిని కేవలం కోవిడ్ చికిత్సా కేంద్రంగానే మార్చింది. అప్పటినుంచి కోవిడ్ కాని సాధారణ రోగులందరికీ సేవలు ఆసుపత్రిలో నిలిపివేయవలసి వచ్చింది. ఇప్పుడు కేసులు తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి మిగతా వైద్య సేవలను కూడా ప్రారంభించారు. అయితే ఇతర రోగులకు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు కరోనా పేషేంట్లకు మిగతా పేషెంట్లకు వేరుగా ఉంటాయని ఆసుపత్రి సూపరిండెంట్ తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,921 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 609 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1541 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,46,606కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 81 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 67, ఖమ్మం జిల్లా నుంచి 51 మరియు నల్గొండ నుంచి 48 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,811కు పెరిగింది. అలాగే సాయంత్రం వరకు మరో 647 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,34,018 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,777 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 03, 2021 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).