Kamareddy, July 18: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Telangana Road Accident) సంభవించింది. మద్నూర్ మండల సమీపంలోని మేనూర్ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునజ్జు అయింది. లారీ కింద ఇరుక్కుపోయిన ఆటోను (auto rams into lorry) బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు యత్నిస్తున్నారు. గోదావరి వరదల వెనుక విదేశీ కుట్రలు, తెలంగాణ వరదలసై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
రాంగ్ రూట్ లో వస్తున్న ఆటో... లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు వాహనాలు వేగంగా వెళుతుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. లారీ కింది భాగంలోకి ఆటో చొచ్చుకుపోయింది. కాగా, ప్రమాద సమయంలో ఆటోలో ఎంతమంది ఉన్నారు? వారు ఎక్కడివారన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటిదాకా 5 మృతదేహాలను బయటికి తీశారు. ఆటో మద్నూరు నుంచి బిచ్కుంద వైపు వెళుతుండగా, కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళుతున్నట్టు గుర్తించారు. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి.