
Hyderabad, Dec 2: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Road Accident) జరిగింది. చేవేళ్ల మండలంలోని మల్కాపూర్ గేట్ సమీపంలో బోర్వెల్ లారీ-ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో (Telangana Road Accident) ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై (Hyderabad-Bijapur road) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, మృతులంతా హైదరాబాద్‌లోని తాడ్‌బండ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న శవాలను బయటకు తీస్తున్నారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఆరుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మృతులు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌కు (Thadband) చెందిన అసిఫ్‌ఖాన్, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభానుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.