తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై 5, 8 తరగతులకు ఉత్తీర్ణత తప్పనిసరి
వారం రోజుల క్రితం క్రిస్మస్, బాక్సింగ్ డే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో డిసెంబరు నెల 25, 26, 27 ఇలా వరుసగా సెలవులు వచ్చాయి. ఆ తర్వాత జనవరి 1వ తేదీన ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఇలా గత డిసెంబర్లో వరుస సెలవుల నుంచి తేరుకునేలోపు వెంటనే సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా 6,432 బస్సులను ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని గమ్యస్థానాలకు తీసుకెళ్లనుంది.