COVID19 in Telangana: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 181 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి, రెండో డోసుల టీకాల పంపిణీతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని....

COVID19 in Telangana: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 181 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
Vaccine | Image used for representational purpose (Photo Credits: Twitter)

Hyderabad, March 12: తెలంగాణలో రోజూవారీ కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు,  కరీంనగర్ మొదలగు అర్బన్ ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. మిగతా చాలా జిల్లాల్లో కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. అటు మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకునే ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

నిన్న రాత్రి 8 గంటల వరకు 21,340 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 181 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 319 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,00,717కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 15, మరియు రంగారెడ్డి నుంచి 19 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 1 కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,650కు పెరిగింది.

మరోవైపు గురువారం సాయంత్రం వరకు మరో 163 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,97,195 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1872 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి, రెండో డోసుల టీకాల పంపిణీతో పాటు  60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 6,86,480 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Mar 12, 2021 10:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).