Representative image (Photo Credit: Pixabay)

Khammam, June 5: ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో బీడీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సముద్రాల మానస (22) ఆదివారం సూసైడ్ చేసుకుంది. కళాశాల సమీపంలోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్న ఆమె నాలుగో అంతస్తులోని గదిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్‌ను పోసుకొని నిప్పంటించుకుంది.

మంటల్లో ఉన్న మానసను పక్క గదుల్లోని విద్యార్థినులు గుర్తించి హాస్టల్‌ నిర్వాహకులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి 80 శాతం కాలిన గాయాలతో మానస ప్రాణాలు కోల్పోయి కన్పించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆమెది ఆత్మహత్య కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

వీడియో ఇదిగో, నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను స్మార్ట్‌గా ఎత్తుకెళ్లిన దొంగలు, రెండు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన మహంకాళి పోలీసులు

ఖానాపురం హవేలి సీఐ శ్రీహరి కథనం ప్రకారం... వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌ ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మంలోని ఓ కళాశాలలో బీడీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఎదురుగా ఉన్న ప్రైవేటు వసతిగృహం నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం సాయంత్రం కాలిపోయిన వాసన వస్తుండటంతో నిర్వాహకులు, ఇతర విద్యార్థినులు వచ్చి చూశారు. ఆమె గది నుంచి పొగలు వస్తుండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లు పోసి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ప్లేయర్, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి

సంఘటనకు ముందు మానస గది నుంచి కేకలు వినిపించాయని కొందరు చెబుతున్నారు. హాస్టల్‌ సమీపంలోని ఓ బంకు నుంచి ఆమె పెట్రోలు కొని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డవడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, మృతురాలి బంధువులు వరంగల్‌ నుంచి రావాల్సి ఉందని సీఐ తెలిపారు. ఆమెది ఆత్మహత్యేనని భావిస్తున్నామని, గదిలో ఎటువంటి లేఖ దొరకలేదని చెప్పారు.

మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్‌ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు.

మానస బలవన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీడీఎస్‌ నాలుగో సంవత్సరంలో ఉన్న ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్‌లాగ్‌లున్నట్లు సమాచారం. అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చునని ఆమె స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.