
Hyd, Dec 28: రాజన్నసిరిసిల్ల జిల్లా తడగొండలో విషాదం చోటు చేసుకుంది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుల మందు (consuming pesticide) తాగి చావు.. అంటూ యువకుడు బెదిరించడంతో ( Young man Harassment) ఓ ఇంటర్ విద్యార్థిని క్రిమిసంహారకమందు తాగింది. చికిత్స పొందుతూ ప్రాణాలు (college girl kills self) కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన మోకెనపెల్లి రాజు–స్వప్న దంపతుల కుమార్తె త్రిష (18) గంగాధరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది.
అదే కాలేజీలో చదువుతున్న తడగొండకు చెందిన కోరెపు సతీశ్ ప్రేమించాలంటూ ఆరు నెలలుగా యువతిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సతీశ్‌ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని యువకుడు సోమవారం ఎవరూ లేని సమయంలో త్రిష ఇంటికి పురుగుల మందు డబ్బాతో వచ్చి ‘ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేదంటే ఈ పురుగుమందు తాగి చావు..’అంటూ బెదిరించాడు.
సతీశ్ వేధింపులు భరించలేక త్రిష పురుగు మందు తాగింది. అప్పుడే వచ్చిన త్రిష సోదరిని చూసిన సతీశ్ పరారయ్యాడు. త్రిషను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కాగా సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరెపు సతీశ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి మంగళవారం తెలిపారు.