Representational Picture. Credits: PTI

మహబూబాబాద్, మార్చి 11: మహబూబాబాద్‌లోని గార్ల మండలం సీతంపేట గ్రామంలో ఈ నెల 9వ తేదీ శనివారం అర్థరాత్రి మూడేళ్ల బాలిక, ఆమె పదకొండు నెలల చెల్లెలుకు తల్లిదండ్రులు విషమిచ్చి చంపినట్లుగా తెలుస్తోంది. గార్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 10వ తేదీ ఆదివారం ఉదయం అక్కాచెల్లెళ్లిద్దరూ నురుగు కారుతున్నట్లు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి లోహిత, జషిత ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి క్రిమిసంహారక బాటిల్‌ను, అందులో కలిపిన పాలను స్వాధీనం చేసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌య్యారం మండ‌లం నామాల‌పాడులో అనిల్, దేవి దంప‌తులు నివాసం ఉంటున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు లోహిత‌(3), జ‌శ్విత‌(1) ఉన్నారు. వారం రోజుల క్రితం అనిల్ త‌న భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి స్వ‌గ్రామం అంక‌న్న‌గూడెంకు వ‌చ్చాడు. అనిల్ తండ్రి వెంక‌న్న స్థానికంగా కిరాణా దుకాణం నిర్వ‌హిస్తున్నాడు.

 అనంతపురంలో మేనల్లుడి చేతిలో మామ దారుణ హత్య, భర్త మరణవార్త విన్న తర్వాత గుండెపోటుతో భార్య మృతి

అయితే ఆదివారం తెల్ల‌వారుజామున షాపున‌కు వెళ్లిన వెంక‌న్న‌.. తిరిగి 10 గంట‌ల‌కు ఇంటికి చేరుకున్నాడు. అప్ప‌టికే ఇంట్లో ఇద్ద‌రు చిన్నారులు విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్నారు. కుమారుడు, కోడ‌లు క‌నిపించ‌లేదు. దీంతో పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. అంక‌న్న‌గూడెం చేరుకున్న పోలీసులు.. చిన్నారుల మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చిన్నారుల త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చిన్నారులు చనిపోయి ఉన్న మంచంపై పాల సీసా, గదిలో ఓ చోట చింపివేసి ఉన్న పాలప్యాకెట్‌, దుస్తులు పెట్టుకునే సంచిలో పురుగుమందు డబ్బా ఉన్నాయి. పిల్లలకు పాలల్లో పురుగుల మందు కలిపి తాగించడం తోనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇద్దరు మనవరాళ్లను కుమారుడు, కోడలు విష ప్రయోగం చేసి చంపి ఉంటారని అనుమానిస్తూ.. వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

చిన్నారుల మృతదేహాల పక్కన ఉన్న సీసాలోని పాలలో విషం కలిపారా? లేదా? అనేది తెలుసుకోవడానికి ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు సాయంత్రం వరకు కూడా కనిపించలేదు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారుల తల్లికి ఆరోగ్య సమస్యలున్నాయని స్థానికులు చెబుతున్నారు. మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు, సీఐ రవికుమార్‌, ఎస్సై జీనత్‌కుమార్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. వెంకన్నను విచారించడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్నారు.