Hyd, Nov 8: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే (Hyderabad Shocker) పశువులా కూతురి మీద పడ్డాడు. తాగిన మైకంలో ఆమెపై అత్యాచారయత్నానికి (Father attempts to rape daughter) ఒడికట్టాడు. ఈ దారుణం తట్టుకోలేక బాలిక ఇంటినుంచి బయటకు వచ్చి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటిలోని ఇంద్రనగర్ (వడ్డెర బస్తీ)లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని ఇంద్రనగర్‌లో గల వడ్డెర బస్తీలో వెంకటేశ్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వెంకటేష్‌కు పదేళ్ల కుమార్తె ఉంది. శనివారం రాత్రి వెంకటేష్ భార్య తమ చెల్లెలు ఇంటికి వెల్లింది. కూతురు ఒక్కతే ఇంట్లో ఉండటంతో అప్పటికే వెంకటేష్ అతిగా మధ్యం సేవించి ఇంటికి వెల్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల కన్నకూతురుపైనే అతని కన్నుపడింది.
కూతురు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన కూతురు కన్నతండ్రి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంకటేష్‌ను పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా బాధితురాలు తనపై తన కన్నతండ్రే అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తండ్రి వెంకటేష్‌పై అత్యాచార కేసుతో పాటు ఫోక్స్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ బాలకృష్ణరెడ్డి తెలిపారు.