Representative Photo (Photo Credit: PTI)

Hyd, April 4: హైదరాబాద్‌లో పెళ్లిరోజున మద్యం తాగవద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.51లోని జర్నలిస్టు కాలనీకి చెందిన కె.రాము(44) కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. గత నెల 31వ తేదీన పెళ్లిరోజు కావడంతో భార్యతో కలిసి ఉదయాన్నే గుడికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి త్వరగా వస్తే బయటకు వెళ్దామంటూ భార్య చెప్పడంతో ఆమెతో గొడవకు దిగాడు.

తాగుబోతు భర్తకు 11 మంది భార్యలు, వాళ్లు వదిలేయడంతో నలుగురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్న ఘనుడు, తాగొచ్చి చివరకు ఆమెను కూడా చంపేశాడు

ఆ రోజు సాయంత్రం మద్యం సేవించాలని, డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. పెళ్లి రోజు కూడా మందు తాగడమేంటని ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో ఆవేశంలో బయటకు వెళ్లి పురుగుల మందు తాగొచ్చాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన రాము.. పురుగుల మందు తాగానని చెప్పాడు. ఇంతలోనే ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో భయాందోళనకు గురైన రాము భార్య.. అతన్ని మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.