Suicide Representative Image (Photo Credits: File Photo)

Hyd, Nov 26: క్రిప్టో కరెన్సీపై మదుపు చేసిన డబ్బులు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన రామలింగ స్వామి (36), ఆనంద్‌ కిశోర్, నరేశ్‌ అనే వ్యక్తులతో కలసి క్రిప్టో కరెన్సీ యాప్‌లో (Cryptocurrency App) రూ.10 లక్షలతో ట్రేడింగ్‌ చేశాడు. పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావడంతో మరికొంత మందితో ఓ యాప్‌లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్‌ చేయడంతో మొదట మూడు వారాలు లాభాలు వచ్చాయి. దీంతో మరింత భారీ పెట్టుబడి పెట్టడంతో లాభాలు రాగా డబ్బులు డ్రా చేద్దామనుకున్న సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు (Losing Money in Cryptocurrency) నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టిన మదుపరులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ రామలింగ స్వామిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన రామలింగ స్వామి మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో పురుగు మందు తాగి ఆత్మహత్య (Man Dies by Suicide After Losing Money) చేసుకున్నాడు. బుధవారం అతడి గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామలింగస్వామి మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వైరల్ వీడియో.. పక్కింటోడి భార్యతో ఎస్సై రాసలీలలు, రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భర్త, సదరు ఎస్సైని సస్సెండ్ చేసిన పోలీసు ఉన్నతాదికారులు, వనపర్తిలో ఘటన

వీరంతా దాదాపు రూ.1.3 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. పెట్టిన పెట్టుబడిలో రూ.60 లక్షలు తిరిగి రాగా రూ.70 లక్షల వరకు యాప్‌లో సాంకేతిక కారణాలవల్ల విత్‌ డ్రా చేసుకోవడం వీలుకాలేదని.. దీంతో రామలింగ స్వామిపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. చనిపోతూ మృతుడు లేఖ రాశాడు, ‘ఆన్‌లైన్‌ బిజినెస్‌లో లాసయ్యాను. నాతో పాటు చాలా మంది నష్టపోయారు. అంతేకానీ నేను ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వాతీ.. పిల్లలు జాగ్రత్త. ఇలా చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ, ఒత్తిడి తట్టుకోలేక ఇలా చేశాను. అర్థం చేసుకో’అంటూ సూసైడ్‌ లెటర్‌లో రామలింగ స్వామి భార్యనుద్దేశించి రాసినట్టు పోలీసులు తెలిపారు.