Hyd, Nov 3: హైదరాబాద్ నగరంలో పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన (Hyderabad Shocker) చోటు చేసుకుంది. ఆరు సంవత్సరాల బాలుడిని మారు తండ్రి చితకబాదడంతో (eing crushed by his father) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన నర్సింహులుకు 11 సంవత్సరాల క్రితం అరుణతో వివాహం జరిగింది.
వీరికి జాన్‌పాల్, జస్వంత్, అరుణ్ (6) ముగ్గురు కుమారులు. కాగా నర్సింహులు మద్యానికి బానిసై సంవత్సరం క్రితం మృతి (six-year-old boy has died) చెందాడు. అరుణ గద్వాలలో పనిచేస్తున్న సమయంలో వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలరోజుల క్రితం వినయ్, అరుణ మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇస్నాపూర్‌కు వచ్చి పద్మారావునగర్ కాలనీలో నివాసముంటున్నారు. అయితే వివాహం జరిగినప్పటి నుంచి వినయ్‌కు అరుణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నచిన్న విషయాలకు బాలుడిని కొట్టేవాడు. మంగళవారం కూడా అరుణ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉన్న అరుణ్‌ని వినయ్ తీవ్రంగా కొట్టాడు.
స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అరుణ్ మృతిచెందినట్లు తెలిపారు. దీంతో బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి వినయ్ పారిపోయాడు. డ్యూటీనుంచి తిరిగొచ్చిన తల్లికి కుమారుడు మృతిచెంది కనిపించాడు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.