SI Couple Commits Suicide (Photo-File Image and Twitter)

Jangaon, April 6: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జనగామలో ఎస్సై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత ఎస్ఐ భార్య స్వరూప ఉరివేసుకొని చనిపోగా.. గంటల వ్యవధిలోనే ఎస్సై శ్రీనివాస్‌ కూడా బాత్ రూంలో తన సర్వీస్‌ రివాల్వర్‌లో కాల్చుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

సెక్స్ వర్కర్‌ని ప్రేమించి పెళ్లాడిన ప్రియుడు, మాజీ ప్రియులతో కలిసి భర్తను దారుణంగా నరికి చంపిన ప్రియురాలు, తమిళనాడులో ఘోరం

తల్లిదండ్రుల మరణంపై కొడుకు రవితేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపి, పోస్టుమార్టం అనంతరం అమ్మనాన్నల మృతదేహాలను అప్పగించాలని ఫిర్యాదులో కోరారు. కొడుకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్సై దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులు ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఆత్మహత్యకు ముందు అసలేం జరిగింది ?

ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌ గత ఎనిమిదేళ్లుగా జనగామ పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రవితేజకు ఈ మధ్య వివాహమవ్వగా భార్యతో కలిసి హైదరాబాద్‌లో బేగంపేట్‌లో ఉంటున్నారు. ఎస్సై దంపతులిద్దరే జనగామలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి శ్రీనివాస్‌, స్వరూప దంపతుల మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగింది.

janagaon SI Son Letter

గురువారం తెల్లవారుజామున పాలు పోసే వ్యక్తి వచ్చి డోర్‌ కొట్టగా ఎవరూ తలుపు తీయలేదు. దీంతో ఇంటి పక్కన నివాసముండే వ్యక్తిని పిలిచి ఇద్దరు కలిసి ఇంటి వెనకున్న డోర్‌ దగ్గరకు వెళ్లగా బయట ఉన్న బాత్‌రూమ్‌లో వెంటిలేటర్‌ ఇనుపరాడ్‌కు స్వరూప తన చీరతో ఉరివేసుకొని ఉండటం చూశారు. వెంటనే వెనుక డోర్‌ ద్వారా ఇంట్లోకి వెళ్లి శ్రీనివాస్‌ను నిద్రలేపారు.. ఎస్సై బాత్‌రూమ్‌కి వెళ్లి చూసేసరికి భార్య విగతజీవిగా కనిపించింది.

విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి ఎస్సై శ్రీనివాస్‌ను పరామర్శించారు. అనంతరం ఎస్సై నివాసానికి ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పట్టణ ఇన్‌ఛార్జ్‌ సీఐ నాగబాబు చేరుకుని పరిశీలించారు.భార్య మృతికి గల కారణాలను ఎస్సై శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక మానసిక వేదనకు గురైన శ్రీనివాస్‌.. ఉదయం 10 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నారు.

ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడటంతో అప్పటికే ఇంట్లో ఉన్న ఏసీపీ, సీఐ బాత్‌రూమ్‌కి వెళ్లి చూడగా.. తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని రక్తపు మడుగులో శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలో ఎస్సై దంపతులు మృతిచెందడంతో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎస్సై తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.