Bandi Sanjay (Photo-ANI)

Hyderabad, April 09: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తన ఫోను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా వెతికి పెట్టాలని కోరారు. ఈ మేరకు కరీం నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ (10th class question papers Leak) కేసులో బండి సంజయ్ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదని ఇటీవలే వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) తెలిపారు. బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాచిపెడుతున్నారని సీపీ రంగనాథ్ ప్రశ్నించారు. బండి సంజయ్ మాత్రం తన ఫోన్ పోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ పోయిందంటూ కరీంనగర్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ ఫోన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎస్సెస్సీ పేపర్ లీకేజీ కేసు (TS SSC leak Case)లో బండి సంజయ్ ఫోన్ ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు కోరారు. బండి సంజయ్ తప్పు చేయకపోతే ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పోలీసులపై కూడా బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట వరకు తనతోనే ఉన్న ఫోను తరువాత ఏమైందని బండి సంజయ్ అంటున్నారు. కోర్టులో సైతం ఇదే వాదనలు వినిపించారు బండి సంజయ్ తరఫు న్యాయవాదులు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో బండి సంజయ్ కు ఇటీవలే బెయిల్ లభించింది.

BRS Formation Day: అట్టహాసంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈనెల 27న తెలంగాణ భవన్‌లో సెలబ్రేషన్స్, అక్టోబర్‌ లో భారీ బహిరంగసభకు నిర్ణయం 

దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. డిలీట్ చేసిన డేటాను పరిశీలిస్తే ప్రశ్నపత్రాల కేసులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. సంజయ్ ఫోన్ లేదని అంటున్నారని చెబుతున్నారు. ఫోన్ ఇస్తే తమకు కీలక సమాచారం వస్తుందని పోలీసులు ఇటీవలే చెప్పారు. కాల్ డేటాతో పాటు, వాట్సాప్ చాటింగ్ ఇంకా రావాలని పేర్కొన్నారు. పేపర్ లికేజ్ సూత్రధారి బండి సంజయ్ అని చెప్పారు.

PM Modi In Hyderabad: మోడీ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియా ఫై పోలీసులు జులుం 

బీజేపీ కార్యాలయంలో లీగల్ బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ఫోను గురించి పోలీసులపై సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. తన ఫోన్ చూసిన తర్వాత కేసీఆర్ షాక్ అయి ఉంటారని చురకలంటించారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసిన విషయం ఆయన సీపీ ద్వారా తెలుసుకొని ఉంటారని తెలిపారు. కేసీఆర్ కు ఫోన్లు వినడం తప్ప వేరే పనేం లేదని విమర్శించారు.

“ఏదో ఇజ్రాయిెల్ టెక్నాలజీ వాడుతున్నాడు అంట కదా? ప్రశాంత్ నాకు ఫోన్, మెసేజ్ లు చేశాడన్నదే పోలీసుల ప్రధాన ఆరోపణ. దీని కోసం ప్రశాంత్ ఫోను ఉంటే సరిపోతుంది.. నా ఫోన్ అవసరం ఏముంది పోలీసులకు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు టెన్త్ పేపర్ లీకేజీ అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ ని రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. టెన్త్ పేపర్ లీక్ అయితే సబితా ఇంద్రారెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని ఆయన అనుకున్నారు. దీంతో కేటీఆర్ పైన ఉన్న దృష్టి సబితా ఇంద్రారెడ్డి వైపు మళ్లుతుందని కేసీఆర్ భావించారు. కానీ, మనం ఎక్కడ కూడా డైవర్ట్ కావద్దు” అని బండి సంజయ్ అన్నారు.