Weather Forecast: తెలంగాణకు వర్షసూచన, రాగల రెండు రోజుల వరకు రాష్ట్రంలో భారీ వర్షాలకు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణశాఖ; నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశం
Rainfall -Representational Image | (Photo-ANI)

Hyderabad, June 3: తెలంగాణ ఉపరితలం మీదుగా గాలుల విచ్ఛిన్నత ప్రభావం మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాల ఆగమన సూచనతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ తుఫాను లాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనావేసింది.

జూన్ 3న జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు పడతాయని అంచనా. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు మరియు ఉరుములు-మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది.

జూన్ 4న అన్ని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంది. అలాగే, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగార్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులంబ-గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

జూన్ 5న ఆదిలాబాద్, కొమరం భీమ్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట మరియు మహబూబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది.

ఇక, నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది. జూన్ 12న తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం అంచనావేసింది.