Govt of Telangana | File Photo

Hyd, May 10: వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌లను స్వల్పంగా పెంచుతూ (Transport dept. enhances life tax) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త లైఫ్‌ ట్యాక్స్‌లు మే9 నుంచి నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి తెలంగాణ మోటర్‌ వాహనాల ట్యాక్సేషన్‌ చట్టం-1963లో 3, 6, 7వ షెడ్యూల్‌లోని వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌ల్లో కొద్దిమేర మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. కొత్తగా కొనే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్‌ ట్యాక్స్‌ (different categories of vehicles) ఆ వాహనం ధరపై ఇప్పటి వరకు 9 శాతం ఉన్నది. కాగా ప్రస్తుతం వాహన ధర ఆధారంగా రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతంగా నిర్ణయించారు.

గతంలో ఇన్‌వ్యాలిడ్‌ క్యారేజ్‌ వాహనాలకు రూ.901 ఉండగా అది రూ.930కి పెంచారు. రూ.50 వేల లోపు ధర ఉండి, రిజిస్ట్రేషన్‌ అయిన రెండేండ్లలోపు వాహనాలకు 8 శాతం, రూ.50 వేలకు పైగా ధర ఉంటే 11 శాతానికి మార్చారు. రెండేండ్లు దాటాక ఏడాది పెరుగుతున్న కొద్దీ వాహన ధరపై ఒక్కో శాతం చొప్పున లైఫ్‌ ట్యాక్స్‌ తగ్గుతుంది. 11 ఏండ్లు పైబడి రూ.50 వేల లోపు ధర ఉన్న వాహనాలకు వాటి ధరపై ఒక శాతం, రూ. 50వేల పైగా ధర ఉన్న వాహనాలకు వాటి ధరపై 4 శాతం లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

అన్న మరణం తట్టుకోలేక గుండెపోటుతో తమ్ముడి మృతి, మంచిర్యాల జిల్లాలో 3 గంటల వ్యవధిలో విషాద ఘటనలు, శోక‌సంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు

కార్లు, జీపులు, 10 సీట్లలోపు (నాన్‌ట్రాన్స్‌పోర్ట్‌)

నూతన వాహనాలు:

వాహనం : లైఫ్‌ ట్యాక్స్‌

రూ.5 లక్షల లోపు : 13 శాతం

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు: 14 శాతం

రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు : 17 శాతం

రూ.20 లక్షలకు పైగా ధర ఉంటే : 18 శాతం (వాహన ధరపై)

రెండేండ్లలోపు:

రూ.5 లక్షల లోపు : 12 శాతం

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు: 13 శాతం

రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు: 16 శాతం

రూ.20 లక్షలకు పైగా ధర ఉంటే: 17 శాతం (వాహన ధరపై) (వాహనం కొని ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ వాహన ధరపై లైఫ్‌ ట్యాక్స్‌ ఒక్కో శాతం తగ్గుతుంది)

12 ఏండ్లులోపు:

రూ.5 లక్షల లోపు : 6.5 శాతం

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు: 7.5 శాతం

రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు : 10.5 శాతం

రూ.20 లక్షలకు పైగా ధర ఉంటే : 11.5శాతం (వాహన ధరపై)

10 సీట్ల వరకు ఉంటే (నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌)

మనుషుల రవాణాకు కంపెనీలు, సంస్థలు ఉపయోగించే కొత్త వాహనాలకు:

రూ.5 లక్షల లోపు : 15 శాతం

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు: 16 శాతం

రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు లోపు : 19 శాతం

రూ.20 లక్షలకు పైగా ధర ఉంటే: 20 శాతం (వాహన ధరపై)

12 ఏండ్లు దాటితే:

రూ.5 లక్షలలోపు : 8.5 శాతం

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు : 9.5 శాతం

రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు : 12.5 శాతం

రూ.20 లక్షలకు పైగా ధర ఉంటే : 13.5 శాతం (వాహన ధరపై)